NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గజ్జహళ్లి గ్రామంలో  పోతులింగేశ్వర స్వామి జాతర వైభవం

1 min read

హోలగుంద న్యూస్ నేడు : గజ్జహళ్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ పోతులింగేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వామి వారి దివ్య దర్శనం కోసం విచ్చేసిన టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ఈబిజి గోవింద్ గౌడ్ , అలాగే టిడిపి యువనాయకుడు శ్రీ ఈబిజి లక్ష్మీనారాయణ గౌడ్ కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.సంప్రదాయ పద్ధతిలో హారతులు, మంగళ వాద్యాలతో అతిథులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకులు స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.అలాగే గజ్జహళ్లి గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలను సందర్శించిన ఈబిజి గోవింద్ గౌడ్  మాట్లాడుతూ,“గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు యువతకు మంచి మార్గదర్శకం. కబడ్డీ వంటి ఆటలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన పెంచుతాయి. యువత ఎక్కువగా క్రీడలపై దృష్టి పెట్టి ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదగాలి. ప్రభుత్వం కూడా క్రీడలకు ప్రోత్సాహం అందిస్తోంది” అని పేర్కొన్నారు.ఈ కబడ్డీ పోటీలలో ఆదోని జట్టు విజేతగా నిలిచి మొదటి విజేత కప్ బహుమతిని గెలుచుకుంది. రూ.15,000/- నగదు బహుమతిని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ఈబిజి గోవింద్ గౌడ్  మరియు టిడిపి యువనాయకుడు శ్రీ ఈబిజి లక్ష్మీనారాయణ గౌడ్  తమ చేతుల మీదుగా అందజేశారు.రెండవ స్థానంలో గజ్జహళ్లి జట్టు నిలిచి రూ.10,000/- నగదు బహుమతిని టిడిపి సీనియర్ నాయకులు బాబూ సాబ్ అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, జాతర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని, ఉత్సాహభరిత వాతావరణంలో జాతరను విజయవంతంగా నిర్వహించారు.స్వామి వారి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గజ్జహళ్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author