డోన్ వాటర్ గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా ప్రారంభం..
1 min read
తాగునీటి సమస్య పరిష్కారానికి మరో కీలక అడుగు: – ఎమ్మెల్యే కోట్ల
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ పట్టణ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా, డోన్ కొండపైన ఏర్పాటు చేసిన 630 KVA ట్రాన్స్‌ఫార్మర్ యార్డ్ మరియు 1200 KL క్లియర్ వాటర్ పంప్ హౌస్‌కు విద్యుత్ సరఫరాను బుధవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డోన్ పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వాటర్ గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని, భవిష్యత్తులో డోన్ ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


