ఏపీ హైకోర్టు ఛీఫ్జస్టిస్గా ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ హైకోర్టు నూతన సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాచే ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్, రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువరు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. కాగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా 2004, జూన్ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అలాగే 2007, సెప్టెంబర్ 1 వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయనను.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా కేంద్రం నియమించింది.