NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉగాది ఏర్పాట్లపై  సన్నాహక సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:        మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉగాదిమహోత్సవాలు నిర్వహింపబడనున్నాయి. 19వ తేదీన ఉగాది పర్వదినం రానున్నది. ఐదురోజులపాటు జరుపబడనున్న ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యాలయంలోని సమావేశభవనములో కార్యనిర్వహణాధికారివారు ఈ రోజు (18.02.2026) సన్నాహకసమావేశాన్ని నిర్వహించారు.  ఈ సమావేశంలో అర్చకస్వాములు, వేదపండితులు, ఆధ్యాపక, (స్థానాచార్యులు) డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఆర్. రమణమ్మ, అన్ని శాఖల అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా ఏర్పాట్లన్నీ  పూర్తి చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉగాది ఉత్సవాలు మార్చి 16 తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజులు ముందుగానే భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని చెబుతూ, మార్చి మొదటివారం కంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.

క్యూలైన్లలో ఏర్పాట్లు :క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని అన్నప్రసాదవితరణ, ఆలయ మరియు క్యూల నిర్వహణ విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.  క్యూకాంప్లెక్సు మరియు క్యూలైన్లలో అదనపు ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట్ల కూలర్ల ఏర్పాటు కూడా ఉండాలన్నారు. తాత్కాలిక వసతి :మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది మహోత్సవాలలో కూడా జర్మన్‌షెడ్లు, పైప్‌పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లక్షలాదిసంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా  అవసరానికి సరిపడ  మేరకు దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు            గుండెజబ్బులు మొదలైన వాటికి అవసరమైన అత్యవసరమైన మందులు, కాలినడకన వచ్చే భక్తులకు బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు (ఆయింట్‌మెంట్‌మందు) మొదలైన వాటితో పాటు అవసరమైన సూది మందులను కూడా సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థమై నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, యజ్ఞవాటిక, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్ఛందసేవకులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.

About Author