NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహ దొంగతనం కేసులో పురోగతి…

1 min read

సుమారు 32 లక్షల విలువైన బంగారం,వెండి నగదు రికవరీ

ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ కె  ప్రతాప్ శివ కిషోర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు జిల్లా పోలీసులు మరో గృహ దొంగతనం కేసులో పురోగతి సాధించి దాదాపు 32 లక్షల విలువైన బంగారం వెండి నగదును రికవరీ చేశారు. మే 13న పోలవరం మండలం జగన్నాధపేటలో జరిగిన గృహ దొంగతనంలో పోలవరం పోలీసులు 247 గ్రాముల బంగారం 2.4 కేజీల వెండి 7 లక్షల నగదు రికవరీ తో పాటుగా దొంగతనానికి పాల్పడిన విసుపర్తి గంగాజలం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా ఎస్పీ ప్రతిభ కనపర్చిన సిబ్బందిని అభినందించారు.

About Author