వినూత్న రీతిలో నిరసన… కాళీ కుర్చీకి వినతి
1 min read– వినూత్న రీతిలో నిరసన… కాళీ కుర్చీకి వినతి..
– కుంకునూరు-దేవనకొండ టర్నింగ్ రోడ్డు(ఎల్లమ్మ గుడి రోడ్డు )బీటీ రోడ్డు వేయాలి..
– సచివాలయంలో కుర్చీకి వినతిపత్రం ఇచ్చిన
– డివైఎఫ్ఐ నాయకులు
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ: మండలంలోని కుంకునూరు గ్రామానికి దేవనకొండ టర్నింగ్ నుండి పాత రోడ్డు ఎల్లమ్మ గుడి రోడ్డు వెంటనే పునర్ నిర్మించి బిటి రోడ్డు వేయాలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పాత రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కుంకునూరు గ్రామ సచివాలయం లోని కాళీ కుర్చీకి వినతి పత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా కుంకనూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడంతో మురుగునీరు రోడ్ల మీదే ప్రవహిస్తుందని, త్రాగునీటి పైపులు లీకేజీలు శుభ్రం చేసి మరమ్మత్తులు చేయాలని డివైఎఫ్ఐ నాయకులు కే శ్రీనివాసులు, చిన్న, వీరేంద్ర లు సచివాలయంలోనికుర్చీ కివినతిపత్రంఅందజేశారు. సమస్యలు చెప్పుకుందామని సచివాలయులకు వెళ్లిన నిరసనకారులకు అక్కడ సచివాలయ కార్యదర్శి అందుబాటులో లేనందున సచివాలయం కుర్చీకి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతు, వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చిన్నపాటి వర్షాలకి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయన్నారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరుకుందు, ముంత పెద్ద తిక్కయ్య, గురురాజా, తిక్కయ్య సింహాద్రి హరికృష్ణ రసూల్ మురళి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.