రాష్ట్రస్థాయి క్రీడలకు కోటా విద్యార్థులు..
1 min read

-పాఠశాల హెచ్ఎం కౌసల్య బాయి..
పల్లెవెలుగు నందికొట్కూరు: రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకునంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర కోటా పాఠశాల ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌసల్య బాయి తెలిపారు.పదవ తరగతి చదువుతున్న దేశావత్ దీపక్ నాయక్,కంభం సాయి చరణ్ కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో బుధవారం జరిగిన 69 వ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఆర్చరీ సెలెక్షన్స్ లో చక్కటి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అయినట్లు అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని హెచ్ఎం అన్నారు.పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ల శ్రీనాథ్ మాట్లాడుతూ దీపక్ నాయక్ రికర్వ్ విభాగంలోనూ, సాయి చరణ్ కాంపౌండ్ విభాగంలోనూ ఎంపికయ్యారని వీరు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో క్రీడాకారులను మరియు ఫిజికల్ డైరెక్టర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ,సరిత,లలితమ్మ, సరోజినీ దేవి,శంషాద్ బేగం, లలిత కుమారి,అనితా శ్రీ, వెంకట రమణ,ఈశ్వరయ్య , మల్లికార్జున రెడ్డి,రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

