పంచాయతీ కార్యదర్శి గా రాజశేఖర్ గౌడ్
1 min read
అభినందనలు తెలిపిన వైయస్సార్సీపి మండల్ కన్వీనర్ ఎం, షఫీ ఉల్లా
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మేజర్ గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ గా విధి నిర్వహణలో ఉండి పంచాయతీ కార్యదర్శి గా అదనపు భారాన్ని మోస్తూ కోడుమూరుగ్రామపంచాయతీకి బదిలీపై వెళ్లిన రాజశేఖర్ గౌడ్ తిరిగి మరల హెుళగుంద పంచాయతీ కార్యదర్శి ఎఫ్ ఎ సి గా బాధ్యతలు చేపట్టారు. సరైన సిబ్బంది లేకపోయినప్పటికీ అటు పరిపాలన ఇటు పారిశుద్ధ్య నిర్వహణ తో పాటు ఇతర సేవలను అందిస్తూ వచ్చిన రాజశేఖర్ గౌడ్ పూర్తి అదనపు బాధ్యతతో పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా పంచాయతీ కార్యదర్శులు కలిసి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు చలవాది పంపావతి, భాష, ఏం రహమతుల్లా, మోదిన్, బి, తవాఫ్, తదితరులు పాల్గొన్నారు.

