వీపనగండ్లలో రమాభాయి అంబేద్కర్ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో నందికొట్కూరు తాలూకా మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో స్వర్గీయ రమాభాయి అంబేద్కర్ 126 వ జయంతి వేడుకలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథుల గా మాల మహానాడు సీనియర్ నాయకుడు డాక్టర్ రాజు,తాలూకా అధ్యక్షుడు ఏసీ నాగేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రమాభాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి విధ్యను కొనసాగించేందుకు తాను కూలీనాలీ చేసి పిడకులు కొట్టి కష్టపడి సంపాదించిన సొమ్మును అంబేద్కర్ గారి విధ్య కోసం పంపడం మాత్రమే కాకుండా బుడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు తన నలుగురు కుమారులను పోగొట్టుకుని కోట్లాది బిడ్డల ఆత్మగౌరవం కాపాడిన మహా త్యాగశీలి రమాభాయి అంబేద్కర్ అని కొనియాడారు.ఈకార్యక్రమంలో సియస్ఐ సంఘపెద్ధలు బక్కన్న, యేసేపు,మనోహర్,శంకర్,శేష న్న,బాలచెన్ను,మాలమహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.