NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘గౌరిగోపాల్​’లో అరుదైన గుండె శస్ర్తచికిత్స..

1 min read
  • డా. లక్ష్మణ స్వామికి కృతజ్ఞతలు తెలిపిన పేషెంట్​ గిడ్డోజిరావు

పల్లెవెలుగు వెబ్​: ప్రపంచంలోనే అరుదైన గుండె సమస్యకు శస్ర్తచికిత్స చేసి… రికార్డు సృష్టించారు నగరంలోని గౌరి గోపాల్​ ఆస్పత్రి వైద్యులు.  మంగళవారం నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్  కార్డియోతోరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ స్వామి, హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శివ శంకర్ రెడ్డి, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మాలకొండయ్య తదితరులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన గిడ్డోజి రావు అనే వ్యక్తి గుండె సమస్యతో  తమ హాస్పిటల్లో సంప్రదించారని తెలియజేశారు. ఆయనకు గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్, 2d ఎకో  లాంటి పరీక్షలు నిర్వహించడంతో అతని గుండె ఎడమ భాగంలో కాకుండా కుడి భాగంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే శరీరంలోని మిగతా అవయవాలు కుడి భాగంలో కాకుండా ఎడమ భాగంలో ఉన్నాయని గుర్తించామని,. దీనికి తోడు గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉండటం తో బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గిడ్డోజి రావు అనేక హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ సమస్య తీవ్రత వల్ల ఎవరూ ముందుకు రాలేదని పేషెంట్ ద్వారా తెలిసిందన్నారు. ఈ పేషెంట్ కు తమ హాస్పిటల్ లో కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ స్వామి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు.  ఇలాంటి కేసులకు ప్రపంచంలో 38 మందికి మాత్రమే ఆపరేషన్లు జరిగాయని, అందులో కూడా బీటింగ్ హార్ట్ సర్జరీ విభాగంలో 15 మందికి మాత్రమే జరిగాయని చెప్పారు. ఈ ఆపరేషన్లు ఇండియాలో ఐదు మందికి జరిగాయని, అలాంటి ఆపరేషన్లు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో విజయవంతంగా చేశామని వారు తెలియజేశారు. ఈ ఆపరేషన్ ఆరోగ్య శ్రీ లో  చేసామన్నారు. అనంతరం పేషెంటు గిడ్డోజి రావు మాట్లాడుతూ తనకు ఆపరేషన్ చేసి జీవితాన్ని  ప్రసాదించిన కార్డియోతోరాశిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణస్వామితోపాటు ఆసుపత్రి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

About Author