అరుదైన లాపరోస్కోపిక్ విప్పుల్ శస్త్రచికిత్స విజయవంతం
1 min read
హైదరాబాద్, న్యూస్ నేడు: గతంలో పాంక్రియాటిక్ శస్తచికిత్స జరిగిన వ్యక్తికే అరుదైన లాపరోస్కోపిక్ విప్పుల్ సర్జరీ చేసి ఊరట కల్పించారు కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను శస్త్రచికిత్స చేసిన క న్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సిహెచ్. నవీన్ కుమార్.హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 52 ఏళ్ల మహిళల గతంలో క్రానిక్ కాల్సిఫిక్ ప్యాంక్రియాటిటిస్‌కు ఓపెన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అదే రోగికి ఇప్పుడు లాపరోస్కోపిక్ విప్పుల్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడామని తెలిపారు. ఇప్పటికే లేటరల్ ప్యాంక్రియాటికోజేజునోస్టమీ శస్త్రచికిత్స చేయించుకున్న ఈ రోగి, పచ్చకామెర్లు (జాండిస్) మరియు వాంతులతో ఆసుపత్రికి వచ్చారు. సమగ్ర పరీక్షల అనంతరం, ప్యాంక్రియాస్‌లో మిగిలిన రాళ్లు (రిమ్నెంట్ ప్యాంక్రియాటిక్ స్టోన్స్) మరియు డ్యూడెనమ్‌లో అడ్డంకి (డ్యూడెనల్ అబ్స్ట్రక్షన్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనితో మరొక శస్త్రచికిత్స అవసరమైంది.మునుపటి ఓపెన్ శస్త్రచికిత్స కారణంగా శరీర నిర్మాణంలో మార్పులు రావడం, అంటుకునే కణజాలం (అడ్హీజన్స్) ఏర్పడటం వంటి సమస్యలు ఉండటంతో ఈ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ, మినిమల్లి ఇన్వేసివ్ విధానాన్ని ఎంచుకుని లాపరోస్కోపిక్ విప్పుల్ శస్త్రచికిత్స (ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ)ను విజయవంతంగా పూర్తి చేశాం.ప్యాంక్రియాటిక్ శస్త్రచికిత్సలు చేసిన రోగుల్లో తిరిగి లాపరోస్కోపిక్ విప్పుల్ శస్త్రచికిత్స చేయడం అత్యంత అరుదైన విషయం. శరీర నిర్మాణంలో మార్పులు, అంటుకునే కణజాలం, శస్త్రచికిత్స మార్గాల మార్పులు వంటి కారణాల వల్ల ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా సవాలుగా ఉంటాయని చెప్పారు.ఈ సందర్భంలో, రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా గ్యాస్ట్రోఇంటెస్టినల్ కంటిన్యూయిటీని కొనసాగించేందుకు వైద్యులు ఒక కొత్త విధానంలో రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ఈ నవీన విధానం శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించింది.“మునుపటి ఓపెన్ ప్యాంక్రియాటిక్ శస్త్రచికిత్స తరువాత లాపరోస్కోపిక్ విధానంలో తిరిగి ఆపరేషన్ చేయడం చాలా అరుదైనది. దీనికి ఖచ్చితమైన ప్రణాళిక, ఉన్నత స్థాయి నైపుణ్యం, ఆపరేషన్ సమయంలో తక్షణ నిర్ణయాలు అవసరం,” అని తెలిపారు.శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా కోలుకొని, వారం రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె స్థితి స్థిరంగా ఉండి, ఫాలోఅప్‌లో బాగానే ఉన్నారు.మునుపటి శస్త్రచికిత్స చేసిన రోగిలో లాపరోస్కోపిక్ విప్పుల్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన ఈ ఘటన చాలా అరుదైనది పేర్కొన్నారు. ఇది మినిమల్లి ఇన్వేసివ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ శస్త్రచికిత్సల్లో సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తోంది.

