NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో రేష‌న్ దుకాణాలు బంద్ !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: స‌మ‌స్యలు ప‌రిష్కరించేంత వ‌ర‌కు ఏపీలో రేష‌న్ దుకాణాలు బంద్ చేస్తున్నట్టు ఏపీ రేష‌న్ డీల‌ర్ల సంఘం ప్రక‌టించింది. రేప‌ట్నుంచి రేష‌న్ దిగుమ‌తి, పంపిణీ నిలిపివేస్తున్నట్టు తెలిపింది. 2020 పీఎంజీకేవై క‌మీష‌న్ బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాల‌ని రేష‌న్ డీల‌ర్ల సంఘం డిమాండ్ చేసింది. డీడీ న‌గ‌దు వాప‌సు, ధ‌ర‌ల వ్యత్యాస స‌ర్క్యుల‌ర్లు అమ‌లు చేయాల‌ని డీల‌ర్ల సంఘం ప్రతినిధులు కోరారు. డీల‌ర్ల నుంచి ఐసీడీఎస్ కు మ‌ళ్లించిన కందిప‌ప్పు బకాయిల‌ను త‌క్షణ‌మే చెల్లించాల‌ని కోరారు. 2020 మార్చి 9 నుంచి ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ నుంచి రావాల్సిన బకాయిలు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. గోనె సంచులు ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తే 20 రూపాయ‌లు చెల్లిస్తామ‌ని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు చెల్లించ‌బోమ‌ని చెప్పడం దారుణ‌మ‌న్నారు.

About Author