PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంతి దాతకు కైమోడ్పులు..

1 min read

క్రెడో పాఠశాలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ.తాండ్రపాడులోని క్రెడో పాఠశాల క్రీడా ప్రాంగణంలో విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.నాగరాజు  వివిధ రకాల యోగాసనాలను విద్యార్థులతో ప్రదర్శింప చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ యోగాసనాల సాధన వలన శరీరానికి అవసరమైన శక్తితో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగార్జున, నిర్మల, హసీనా, సాయిశ్రీ, శశికళ, సుశీలతో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *