NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శేష జీవితం.. ఆనందంగా గడపండి..

1 min read

ఇరిగేషన్​ ఎస్​.ఈ. ద్వారకనాథ్​ రెడ్డి

కర్నూలు, న్యూస్​నేడు:ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తలంపుతో నిరంతరం ప్రజలకు సేవ చేసే ఉద్యోగులు… శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఇరిగేషన్​ ఎస్​.ఈ. ద్వారకనాథ్​ రెడ్డి. శుక్రవారం నగరంలోని ఆర్​ ఎస్​ సర్కిల్​లోని  జల వనరుల శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్​ గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్​. విజయ భారతి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్​.ఈ. ద్వారకనాథ్​ రెడ్డి మాట్లాడారు. జల వనరుల శాఖ కార్యాలయంలోనే 38 ఏళ్ల కిందట టైపిస్టుగా విధుల్లో చేరిన విజయ భారతి… అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ సూపరింటెండెంట్​ స్థాయికి రావడం అభినందనీయమన్నారు. ఉద్యోగులందరూ తమ పని సక్రమంగా చేసుకుంటూ పోతే… ఉన్నత పదవులు అవంతకవే వస్తాయని, ఇందుకు సూపరింటెండెంట్​ విజయ భారతి   ఆదర్శమన్నారు.  ఆ తరువాత సూపరింటెండెంట్​ ఎన్​. విజయ భారతి ఉద్యోగులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో  డిప్యూటీ ఎస్​.ఈ. బాల చంద్రా రెడ్డి, ఎన్​.టి.పి.ఏ. మల్లిక, స్టెనోగ్రఫర్​ విజయ కుమార్​,  విజయభారతి భర్త , రిటైర్డు పారా మెడికల్​ ఆఫీసర్​ కరణం గోపినాథ్​ రావు ,  కొడుకు కరణం షణ్మఖ శ్రీనివాస్​, కోడలు స్నేహ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *