“స్పందన”లో వినతి కి స్పందించిన రెవెన్యూ అధికారులు!
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం జర్నలిస్ట్ సంఘాలు ఇచ్చిన జగన్నాథ గట్టు హౌసింగ్ సొసైటీ వినతికి స్పందించిన రెవెన్యూ అధికారులు. దశాబ్ద కాలంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కుంటున్న స్థానిక జగన్నాథ గట్టు హౌసింగ్ ప్లాట్స్ పరిశీలనకు రెవెన్యూ అధికారులు ఆర్ డీ ఓ హరిప్రసాద్ ఎమ్ ఆర్ వో శివరాముడు సంబంధిత వి ఆర్ వో మరియూ సర్వేయర్ బృందం గట్టు హౌసింగ్ పరిసర ప్రాంతాల్లో అన్ని వైపుల పరిశీలించారు! దీనికి కర్నూలు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యుచువల్లీ ఐడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జెన్ సెక్రెటరీ యస్ కే మహేష్ సీనియర్ జర్నలిస్ట్ ఏ పీ జే ఎఫ్ ఫోటో మరియు వీడియో గ్రాఫర్ అసోసియేషన్ రామ స్వామి తదితరులు హాజరయ్యి వారి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు! ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గతం లో డబ్బు చెల్లించి కొన్న ఇంటి స్థలాలు మౌలిక సదుపాయాలు లేక నిర్మాణము చేసుకోలేక పోయాము కావున ప్రభుత్వం స్పందించి ఇంటి నిర్మాణమునకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి అని కోరారు! దానికి అనుగుణంగా స్పందించిన అధికారులకు హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు ప్లాట్ ఓనర్స్ అన్నీ జర్నలిస్టు యూనియన్ లు వారికి కృతజ్ఞత లు తెలిపారు! జగన్నాథ గట్టు లో కేటాయించిన ఆర్ టీ సి ఎంప్లాయీస్ ప్రింటింగ్ ప్రెస్ ఎంప్లాయీస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మొదలగు పలు సంఘాల వాళ్లకు ఇక్కడ స్థలము ఇచ్చారు కానీ మౌలిక సదుపాయాలు లేక ఎవ్వరు కుడా నిర్మాణాలు మొదలు పెట్టలేదు ! అందరూ ఇలాగే ఇబ్బంది పడుతున్నారు! ఇక్కడ మరో టౌన్ షిప్ డెవలప్ అయ్యే అవకాశముంది కావున ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు!