“లీగల్ సర్వీసెస్ స్టాఫ్ విధులు పై రివ్యూ మీటింగ్”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జి.కబర్థి, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు “లీగల్ సర్వీసెస్ స్టాఫ్ విధులు పై రివ్యూ మీటింగ్” నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జడ్జి లీగల్ సర్వీసెస్ స్టాఫ్ యొక్క విధులు, లీగల్ ఎయిడ్ కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలపై సూచనలు చేశారు.అలాగే ఆగస్టు 21,22, 23వ తేదీల్లో సుప్రీంకోర్టులో జరగబోయే స్పెషల్ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న కేసుల సెటిల్మెంట్ కొరకు కృషి చేయాలని కోరారు.లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్టాఫ్ వారి వద్ద గల పెండింగ్ కేసులలో ఎన్ని కేసులలో బెయిల్స్ మంజూరు చేశారో వాటి కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. శాశ్వత లోక్ అదాలత్ స్టాఫ్ ప్రజా వినియోగ 10 రకాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అనంతరం కార్యాలయాలకు సంబంధించిన రికార్డులు మరియు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఏ. సులోచన, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది, శాశ్వత లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.

