ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రుణాల మంజూరు పై బ్యాంకర్లతో సమీక్ష
1 min read
ప్రభుత్వ సంక్షేమ పథకాల తో పాటు అవసరం లో ఉన్న పేదలకు రుణాలు మంజూరు చేయండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల తో పాటు అవసరం లో ఉన్న పేదలకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బ్యాంకర్ల కు సూచించారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం లో జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాల మంజూరు గురించి బ్యాంకర్లతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి 24 శాతం మాత్రమే రుణాలు మంజూరు చేశారని, ఇంకా 60 కోట్లు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని, మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.. అదే విధంగా అగ్రికల్చర్ టర్మ్ లోన్లు కూడా 69 శాతం మంజూరు చేశారని, నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి గ్రామాల్లో వ్యవసాయ పరికరాలు అవసరమైన రైతులను గుర్తించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ కి సంబంధించి కూడా 15 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని, రుణాలు మంజూరు చేసి రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.. ఎంఎస్ఎంఈ లకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కరూర్ వైశ్యా బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ లు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్నాయని, లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం లో వెనుక బడి ఉన్నారని, లోన్ లు ఇప్పించలేనపుడు కార్డులు ఇచ్చి ఉపయోగం ఉండదని కలెక్టర్ వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.అవసరంలో ఉన్న పేదలకు రుణాలు మంజూరు చేసి మానవత్వాన్ని చూపించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు..చిన్న చిన్న మొత్తాల కొరకు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు నిత్యం వార్తల్లో చూస్తుంటామని, నిజంగా అవసరం ఉన్న వారు లోన్ కొరకు బ్యాంక్ ల వద్దకు వస్తే, అటువంటి వారికి లోన్ లు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ సూచించారు..సమావేశంలో కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్ ఆఫీసర్ అభిషేక్, నాబార్డ్ డిడిఎమ్ సుబ్బారెడ్డి, ఎల్ డి ఎమ్ రామచంద్ర రావు, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్ ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.