NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రీ సర్వే, రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్ష

1 min read

ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు, న్యూస్​ నేడు:  రీ సర్వే కి సంబంధించి డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాల ఈ కేవైసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ తహసిల్దార్ లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో  కాన్ఫరెన్స్ హాల్  నుండి రీ సర్వే, రెవెన్యూ అంశాలపై జిల్లా  అధికారులు, మండల స్థాయి అధికారులతో ఇంచార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే కి సంబంధించి డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాల ఈ కేవైసి పనులు శనివారం నాటికి పూర్తి చేయాలని గత సమావేశంలో చెప్పినప్పటికీ అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు.  ఈ కేవైసి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు.పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ నిదానంగా జరుగుతుందని, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు. ఫేస్ 3 రీ సర్వే కి సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు.. మ్యుటేషన్ కి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఎట్ టూ వ్యూ లో కూడా ఏవి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇంచార్జి డిఆర్ఓ చిరంజీవి, ఏడి సర్వే మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author