ప్రభుత్వ మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి..
1 min read
సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రభుత్వం కందులకు మద్దతు ధరతో పత్తికొండ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ, పత్తికొండ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి స్థానిక ఆర్డివో కార్యాలయం వరకు సిపిఎం శ్రేణులు రైతులతో ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుందని ఇప్పటికే పండించినటువంటి పంటకు టమోటా ఉల్లి పత్తి సబ్జా గిట్టుబాటు లేక రైతులు అప్పులు పాలయ్యారని కనీసం ప్రభుత్వం చెప్పినటువంటి 8 0000 రూపాయలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ వెంకటరత్నమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కాశన్న, రైతు సంఘం మండల అధ్యక్షులు రాజుల కారప్ప,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజ్జులు, శికామణి, డివైఎఫ్ఐ నాయకులు దుగ్గేన్న, మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు రంగస్వామి, ఆటో వర్కర్స్ నాయకులు శేఖర్, సంజీవ్, హమాలీ వర్కర్స్ నాయకులు ఉరుకుందు, నడిపి రంగన్న, ఆనంద్, బిల్డింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

