NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీబీఎస్ఈ క్లస్టర్–VII ఫుట్‌బాల్ పోటీల్లో రిడ్జ్ పాఠశాల ఘన విజయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ క్లస్టర్–VII ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్ (ద్వితీయ స్థానం) సాధించి పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.జూలై 28 నుండి 31 వరకు నెల్లూరు జిల్లా లోని అదని స్కూల్ వారునిర్వహించిన అండర్–14 బాలుల విభాగం ఫుట్‌బాల్ పోటీలలో మొత్తం 140 జట్లు పాల్గొనగా, రిడ్జ్ పాఠశాల జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా పాఠశాల లో జరిగిన అభినందన సభలో సీఈవో జి. గోపినాథ్  మాట్లాడుతూ, విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ ఎంతో ప్రశంసనీయమని, పాఠశాలకు మరియు కర్నూలు జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని అభినందించారు.కో-సీఈవో సౌమ్య గోపినాథ్  మాట్లాడుతూ, ఫుట్‌బాల్ వంటి క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి అహర్నిశలు శ్రమించిన ఫుట్‌బాల్ కోచ్ బ్రహ్మకుమార్ ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్ , హెచ్‌వోడీలు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజేత విద్యార్థినులను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *