NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్లు పునరుద్ధరణకు పనులు వేగవంతం చేయాలి

1 min read

జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇటీవల జిల్లాలో మంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులపై సమీక్షా సమావేశం ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు.సమావేశంలో సీఈఓ జిల్లా పరిషత్  ఎం. శ్రీ హరి, డిప్యూటీ సీఈవో  కె.భీమేశ్వర్, ఎస్ ఈ పి ఆర్ జెడ్.రమేష్,ఈ ఈఈ లు, డి ఈ లు అన్ని మండలాల ఏఈ ఏఈ లు పాల్గొన్నారు.ఇ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఘంటా పద్మశ్రీ  మాట్లాడుతూ ఇటీవల సంభవించిన మంథా తుఫాన్ వల్ల జిల్లాలోని అనేక గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, తక్షణ చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు. అధికారులు ప్రతి మండల స్థాయిలో రోడ్ల నష్టం వివరాలను సేకరించి, అత్యవసర మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల పునరుద్ధరణను ప్రాధమికంగా చేపట్టాలని సూచించారు.అలాగే, తాత్కాలికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో గుంతలు పూడ్చడం, డ్రెయినేజ్ శుభ్రపరచడం, నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.తదుపరి దశలో నష్టానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి మైనర్ రిపైర్లకు జిల్లా పరిషత్కు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. “ప్రజల సౌకర్యం కోసం, అభివృద్ధి పనులు నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయడం మన అందరి బాధ్యత. జిల్లా పరిషత్ కు సాద్యమైనత మేర ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో రహదారుల పునరుద్ధరణ త్వరితగతిన చేపడతాం,” అని పేర్కొన్నారు.జిల్లా ప్రజల కోసం రోడ్ల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఘంటా పద్మశ్రీ  అధికారులు సూనిశితంగా ఆదేశించారు.

About Author