రూ.1756 కోట్లు.. ఎలా లబ్ధిచేకూర్చుతారో…!
1 min read– ముస్లిం సమాజానికి తెలపండి..
– సంఘ సేవకులు సయ్యద్ సలా ఉద్దీన్
పల్లెవెలుగు వెబ్, కడప: రాష్ట్ర వార్షిక బడ్జెటలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.1756 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటయించడం సంతోషించదగ్గ విషయమని, అయితే ఏ పథకం ద్వారా లబ్ధిచేకూర్చుతారో ముస్లిం సమాజానికి తెలపాలని సంఘ సేవకులు సయ్యద్ సలా ఉద్దీన్ కోరారు. ఎన్నికల హామీలో ఇమామ్ మరియు మౌజనులకు గౌరవ వేతనం పెంచడం తప్ప మిగతా హామీలను వైయస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించకపోవడం శోచనీయం అన్నారు. మైనార్టీ వర్గాలకు సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన మొత్తం బడ్జెట్ ను యాక్షన్ ప్లాన్ ద్వారా పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఆ యాక్షన్ ప్లాన్ ఏమిటో స్పష్టం చేయాలని సలా వుద్దీన్ డిమాండ్ చేశారు. సమావేశంలో ఇక్బాల్, ఖాదర్ బాషా పాల్గొన్నారు.