సుప్రీంకోర్టు కేసుల పరిష్కారానికి – సమాధాన్ సమా రోహ్”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాకు చెందిన కక్షి దారులు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న తమ కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి సమాధాన్ సమరోహ్-2026 ఒక చక్కని వేదికంగా నిలుస్తుంది అని కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు మీడియేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యవర్తుల సహకారంతో ఈ సెటిల్మెంట్ ప్రక్రియ నిర్వహించ బడుతుందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ శనివారం నగరంలో విస్తృత ప్రచారం చేపట్టింది. లీగల్ సర్వీసెస్ సంస్థకు చెందిన ప్రత్యేక సంచార వాహనం ద్వారా నగరంలోని ప్రధాన కూడల్లు అయిన చెన్నమ్మ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్ ఆఫీస్ ప్రాంతాలలో కక్షి దారులకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న ఆగస్టు 2026 వరకు ప్రతిరోజు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ నందు ఈ ఫ్రీ సిట్టింగ్ మీడియేషన్ నిర్వహించబడుతుందని, ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో తమ కేసులను త్వరిత గతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివాదాలకు ముగింపు పలికేందుకు ఈ ఉచిత న్యాయ సేవలు కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 15100, 08518-248828కు ఫోన్ చేయాలని కోరారు.

