మహిళల స్వేచ్ఛ కోసం పాటుపడిన దీరవనిత.. సరోజినీ నాయుడు
1 min read
జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలో మహిళల స్వేచ్ఛ కోసం మహిళా సాధికారత కోసం అలుపెరుగని కృషిచేసిన ధీరవనిత సరోజినీ నాయుడు అని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ శ్రీమతి సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీ బెంగాలీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అగోరనాథ్ చటోపాధ్యాయ దంపతులకు జన్మించారని తెలియజేశారు. ఆమె 12 సంవత్సరాల వయసులోనే మద్రాసు యూనివర్సిటీలో చదివారని అనంతరం ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీతో పాటు కింగ్స్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారని వివరించారు .అదే సమయంలో భారత సంతతికి చెందిన డాక్టర్ గోవిందరాజు నాయుడుతో పరిచయం ఏర్పడి ఆయనను కులాంతర వివాహం చేసుకున్న సరోజిని దేవి తర్వాత సరోజినీ నాయుడుగా ప్రాముఖ్యం పొందాలని వివరించారు. ఆమె దేశ స్వాతంత్ర పోరాటంతో పాటు మహిళల స్వేచ్ఛ కోసం మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆమె కృషివల్లే భారత దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించబడిందని వివరించారు .ఆమెను మహాత్మా గాంధీ నైటింగేల్ ఆఫ్ ఇండియా గా అభివర్ణించారని వివరించారు. శ్రీమతి సరోజినీ నాయుడు మంచి రచయిత కవయిత్రి అని ఆయన తెలియజేశారు. ఆమె మహాత్మా గాంధీతో పాటు క్విట్ ఇండియా, దండి మార్చ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారని, స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆమె ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా ఆమె చరిత్ర సృష్టించారని తెలియజేశారు. ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అనిబిసెంట్ తర్వాత ఆమె ఆ పదవిని చేపట్టారని వివరించారు. దేశంలో మహిళల వెనుకబాటు తనంపై ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఆమెకు ఉందని తెలిపారు. దేశంలో మహిళా నిరక్షరాస్యత అధికంగా ఉందని మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ దేశంలో అయితే మహిళలు అక్షరాస్యులుగా ఉన్నత పదవుల్లో ఆదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వివరించారు.
