PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆళ్లగడ్డ క్లస్టర్ లీగల్ కోఆర్డినేటర్ భాష సిఆర్పిలకు సూచించారు. స్థానిక వెలుగు క్రాంతి పథం కార్యాలయంలో సోమవారం అయన సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ హెచ్ జి పక్షోత్సవాలలో భాగంగా సెర్పు సీఈవో , ఏపీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మండల పరిధిలోని ఆయా గ్రామాల గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో సంఘాల బలోపేతం తద్వారా అభివృద్ధి చెందే విధానం తదితర అశాలపై పొదుపు మహిళలకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే సీసీకి ఇద్దరు సిఆర్పిల చొప్పున ఏర్పాటు చేసి పొదుపు మహిళల రికార్డుల నిర్వహణ సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. సీఆర్పీలు గ్రామాలలోని పొదుపు మహిళలకు సమావేశాలు నిర్వహించి రికార్డుల నిర్వహణపై సంఘాల బలోపేతం కొత్త గ్రూపుల ఏర్పాటు తదితర అంశాలపై మహిళలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పుల్లయ్య దేవదానం హజరయ్య పి పుల్లయ్య చంద్రపాల్ సిఆర్పిలు పాల్గొన్నారు.

About Author