4వ అంతర్జాతీయ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ లో ఏపీకి మెడల్స్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/16-5.jpg?fit=550%2C310&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 1 నుండి 5 వరకు ఢిల్లీ వేదికగా జరిగిన నాల్గవ అంతర్జాతీయ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు జాదవ్ ఇండోర్ స్టేడియం ఇంద్ర గాంధీ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీలో జరిగాయి ఇందులో మొత్తం 20 దేశాలు పాల్గొన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం28మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నరు అందులో 24 మంది క్రీడాకారులకు పథకాలు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులు 3 బంగారు 9 వెండి పథకాలు 12 కాంస్య పథకాలు రావడం జరిగింది అందులో మన కర్నూలు జిల్లాకు చెందిన త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ క్రీడాకారులు సీనియర్ విభాగంలో గుర్రం జయ కళ్యాణ్ పాయింట్ ఫైవ్ ఈవెంట్లో 69కేజీ వెయిట్ విభాగంలో వెండి మెడల్ మరియు గుర్రం హరి కళ్యాణ్ రింగ్ ఫైట్ లౌ కిక్ 75కేజీ విభాగంలో వెండి మెడల్ మరియు ఉప్పరి ఉపేంద్ర పాయింట్ ఫైటు 63 కేజీ విభాగంలో కాంస్య మెడల్ మరియు జూనియర్ కేటగిరి విభాగంలో బొడ్డు బోయిన ఈశ్వర్ పాయింట్ ఫైవ్ 63 కేజీ విభాగంలో వెండి మెడల్ కిట్ లైట్ విభాగంలో 63 కేజీ విభాగంలో వెండి మెడల్.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/161-2.jpg?resize=550%2C336&ssl=1)