స్మశాన వాటిక హద్దులకు భంగం కలగకుండా చూడండి…
1 min read
కుర్ని స్మశాన రాస్తాను డ్రైనేజీ వేయడం ద్వారా రాస్త ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
ఎమ్మిగనూరు , న్యూస్ నేడు: పట్టణంలోని కుర్ని స్మశాన వాటిక తూర్పు పక్కన ఉన్న బండి రాస్తా ప్రక్కన మునిసిపాలిటీ వారు డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారని మాకు తెలిసింది. ఇది అభివృద్ధికి దోహదపడే అంశమే అయినా, ఈ పనులు చేపట్టే సమయంలో స్మశాన వాటిక హద్దులకు భంగం కలగకుండా చూసుకోవాలని మునిసిపల్ అధికారులను కోరుతున్నాము.కుర్ని స్మశాన వాటిక భూమి (సర్వే నంబర్లు: 101-A-3, 101-B-3, 101-C-3 మరియు 53-A, B లో గల స్మశాన భూమి) హద్దులు దాటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, స్మశాన వాటిక భూమిలో పనులు జరగకుండా, మా సమక్షంలోనే పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ నేపథ్యంలో, మునిసిపల్ కమిషనర్ గంగిరెడ్డి కి వైయస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్, చేనేత జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ మరియు దైవాచార సంఘ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు.మునిసిపాలిటీ అధికారులు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, స్మశాన వాటిక హద్దులను పరిరక్షిస్తూ పనులు చేపడతారని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.