NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుశిక్ష

1 min read

యూరియాకు పేర్లు నమోదు

డీఏవో వెంకటేశ్వర్లు,డిడిఏ గంగాధర్ రావు..

నందికొట్కూరు న్యూస్ నేడు: నకిలీ పంట విత్తనాలు అమ్మితే జరిమానా మరియు జైలు శిక్ష తప్పదని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు.నంద్యాల జిల్లా పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం డివిజన్ లో ఉన్న ఇన్ ఫుట్ డీలర్లు మరియు రైతు సేవ కేంద్రాల సిబ్బందితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఆర్ఎస్కే సిబ్బందితో పున: సమీక్షించారు.రాబోయే రోజుల్లో యూరియా కావాలంటే రైతులు ఆర్ఎస్కే కార్యాలయానికి వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే యూరియా పంపిణీ చేయాలని నకిలీ లేబుల్ వేసినా కల్తీ విత్తనం అమ్మినా చర్యలు తప్పవని డిఏఓ అన్నారు.డిడిఏ గంగాధర్ రావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా పురుగు మందులు అమ్మకూడదు ప్రతి మందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది లైసెన్సు కలిగిన వారు మాత్రమే మందులను అమ్మాలి లైసెన్సు లేనివారు అమ్మినట్లయితే చర్యలు తప్పవని అన్నారు.మందులు కొనేటప్పుడు రైతులు మందు రిజిస్ట్రేషన్ గడువు తేదీ తప్పనిసరిగా చూడాలని నకిలీ విత్తనాల నుండి కాపాడేందుకు 1966 విత్తనాల చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డిఎం హరినాధ రెడ్డి,ఏడిఏ గిరీష్,టెక్నికల్ వ్యవసాయ అధికారి పనే శ్వర్ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి,జూపాడుబంగ్లా, పగిడ్యాల ఎంఏవో లు కృష్ణారెడ్డి,మురళీధర్ మరియు సిబ్బంది డీలర్లు పాల్గొన్నారు.

About Author