పొన్నకల్లు గ్రామంలో దగ్ధమైన గడ్డివాములను పరిశీలించిన ఎంపీ నాగరాజు
1 min read
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ కక్షలకు పాల్పడితే సహించేది లేదు..ఎంపీ నాగరాజు
కర్నూలు , న్యూస్ నేడు: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ కక్షలకు పాల్పడితే సహించేది లేదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హెచ్చరించారు..గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో అగ్నికి దగ్ధమైన గడ్డివాములను ఆయన పరిశీలించారు.. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా రాజకీయ కక్షతోనే తమ గడ్డి వాములకు నిప్పు పెట్టారని బాధితులు ఎంపీ ముందు వాపోగా, ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు…అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలను,దాడులను ప్రోత్సహిచదని తెలిపారు…గడ్డివాములు దగ్ధమైన ఘటన లో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు..బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామని ఎంపీ తెలిపారు.

