NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల కోసమే శక్తి యాప్

1 min read

కూలీలకు అవగాహన కల్పించిన ఏఎస్ఐ నీతమ్మ..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: మహిళల కోసమే ప్రభుత్వం శక్తి యాప్ ను తీసుకు వచ్చిందని నందికొట్కూరు ఏఎస్ఐ నీతమ్మ  అన్నారు.ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరులో జరుగుతున్న ఉపాధి పనుల దగ్గర కూలీలకు మంగళవారం ఉదయం ఏఎస్ఐ శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూశక్తి యాప్ నంబర్- 7993485111 ను తెలుపుతూ ప్రస్తుతం సమాజంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాల గురించి ఆ చట్టాల వల్ల వాళ్లకు కలిగే రక్షణ గురించి తెలుపుతూ సమాజంలో ఎవరన్నా మీతో అసభ్యంగా లేదా దురుసుగా ప్రవర్తించినప్పుడు మీరు పోలీసువారికి తెలియపరిస్తే మీకు పోలీసులు రక్షణగా ఉంటారని ఆపద సమయాల్లో ఎమర్జెన్సీ నెంబర్ 112,100 కి కాల్ చేసి సమాచారం ఇస్తే పోలీసు వారు వెంటనే అక్కడికి వస్తారని ఏఎస్ఐ మహిళలతో అన్నారు.ఈ శక్తి యాప్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అదేవిధంగా బాలికలకు బాల్య వివాహాలు చేయకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈసీ షబాన,టెక్నికల్ అసిస్టెంట్ శ్రీవాణి,కానిస్టేబుల్ రసూల్,ఎఫ్ఏ మధు మరియు ఉపాధి కూలీలు 90 మంది పాల్గొన్నారు.

About Author