NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  విశాఖ ఉక్కు కర్మాగారంలో స్టీల్ మెల్టింగ్ షాప్ – 1 లోని కంటిన్యూయస్ క్యాస్టింగ్ డిపార్ట్మెంట్  మిషన్ -2 వద్ద 150 టన్నుల ద్రవరూప ఉక్కును తరలిస్తుండగా ల్యాడల్ ఒక్కసారిగా పెలిపోవడంతో సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణొగ్రతతో కూడిన ద్రవ ఉక్కు ఒలకడంతో, ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న 8 మంది కార్మీకులు మృతి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాడ సంతాపం తెలియజేశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరారు.  దుర్ఘటన జరిగిన వెంటనె రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  సంభందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అక్కడి పరిస్తితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహాయ చర్యలు జరిగేలా చూశారని అన్నారు. అలాగే తెలుగుదేశంపార్టీ నారా లోకేష్, పవన్ కళ్యన్ పల్లా శ్రీనివస్ లు, మరియు మంత్రులు, ఎం.ఎల్.ఏలు  ఘటన స్థలికి చేరుకొని సంఘటనా స్థలిని పరిశీలించి ఇలాంటివి పునారవృతం కాకుందా అధికారులతో మాట్లాడి వారికి తగిన ఆదేశాలు ఇచ్చారని అన్నారు.  ఈ గొడ్డలి పార్టీ నాయకులు శవాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నారని, ఈ రోజు ప్రమాద స్థలికి చేరుకొని రభస చేయడం బాధాకరం,  ఈ ఘటనలో మృతి చెందిన వారి కుంటుంభానికి ప్రభుత్వం తరపున 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల రూపాలు, కుటుంభంలోని సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. వైసిపి శవ రాజకీయాలు మానేసి బాధితులకు అండగా ఉండాలని, శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.  కూటమి ప్రభుత్వం పై నిందలు వేయాలనె తపన తపితే ఇంకో ఆలోచన గొడ్డలి పార్టీ నాయకులకు లేదని అన్నారు.  ప్రతిపక్ష హోదా లేకపోయిన గొడ్డలి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం పై నిందలు వేయడం నీచమైన చర్య అని, ఇప్పటికైన శవరాజకీయాలు  మానుకోవాలని హితవు పలికారు.  కూటమి నాయకులు బాధిత కుటుంభాలకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారని అన్నారు.

About Author