పొలవరం ప్రాజెక్టులో రెండో రోజు కొనసాగిన మట్టి నాణ్యత పరీక్షలు
1 min read
పాల్గొన్న కేంద్ర బృందం సభ్యులు,జలవనరుల శాఖ అధికారులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు రెండో రోజు గురువారం కూడా కేంద్ర నిపుణుల బృందం చేసింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు రెండోరోజు దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షించడం తో పాటు, మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయం లో పరీక్షించేందుకు సేకరించారు. స్థానికంగా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. మట్టి నాణ్యతా పరీక్షల్లో జలవనరుల శాఖ డీఈ వి.నిర్మల,ఈఈ డి శ్రీనివాసులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.