NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, చీరాల వారు అన్నప్రసాద వితరణ విభాగానికి లక్ష విస్తరాకులను విరాళంగా అందజేశారు.వీరు అన్నపూర్ణాభవనం నందు సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకుల  వీటిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని  ఈ విస్తరాకులను సమర్పించడం జరిగిందన్నారు. వీటి విలువ రూ. 3,00,000/-లకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. గత కొన్ని  సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వీరు విస్తరాకులను అందజేయడం జరుగుతోంది.ఈ కార్యక్రమములో భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి యం.వి. మహాలక్ష్మీ, పలువురు సేవా సమితి ప్రతినిధులు శివ సేవకులు పాల్గొన్నారు.

About Author