ఇంటర్లో ‘ శ్రీ చైతన్య’ విజయ దుందుభీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శ్రీ చైతన్య కళాశాళల ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ తెలిపారు. సీనియర్ విభాగం నందు యం.పి.సి. లో తమ విద్యార్థి యం.లహరి 1000 మార్కులకు గాను 991 మార్కులు. ఎమ్. అఫ్రా సనా 1000 మార్కులకు గాను 990 మార్కులు, బై.పి.సి.లో తమ విద్యార్థిని ఎస్.ఎన్. హర్శితా యాదవ్ 1000 మార్కులకు గాను 988 మార్కులు, ఎమ్. మోనికా జాదవ్ 1000 మార్కులకు గాను 988 మార్కులు, మరియు జూనియర్ విభాగం నందు యం.పి.సి. లో తమ విద్యార్థులు 470 మార్కులకు గాను డి.గౌరి ప్రశాంత్ 466 మార్కులు, జి. లావన్య 466 మార్కులు, ఎస్. దేవ వర్షిని రెడ్డి 466 మార్కులు, జూనియర్ బై.పి.సి. విభాగం నందు 440 మార్కులకు గాను కె.భావన 436 మార్కులు, బి. జ్వలిత 436 మార్కులతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించడం జరిగిందని ఎ.జి.ఎమ్. మరళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాళలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు.