NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన … శ్రీ జె. బాబు ప్రసాద్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎస్పీ కి క్యాంపు కార్యాలయంలో కర్నూల్ ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన … అడిషనల్ ఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ జె. బాబు ప్రసాద్  ఇటీవల అదనపు ఎస్పీ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  మాట్లాడుతూ…అడిషనల్ ఎస్పీగా  పదోన్నతి పొందిన  జె. బాబు ప్రసాద్కి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖలో ఆయన సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

About Author