NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవు

1 min read

ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి

క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని, మార్పు కనబడకపోతే సంబంధిత శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కార్యదర్శులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తాను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, లోపాలను సరిచేసుకునేందుకు దిశానిర్దేశం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధతో విధులను నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగాలని సూచించారు. తిరిగినప్పుడే సమస్యలు సులువుగా అర్థం అవుతుందన్నారు‌.‌ ప్రతి వాహనానికి వెళ్ళాల్సిన మార్గాన్ని మ్యాపింగ్ చేయాలని, ఆ విషయాన్ని డ్రైవర్‌కి, పారిశుద్ధ్య సిబ్బందికి, ప్రజలకు స్పష్టం తెలియజేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ రెండు ఖాళీ స్థలాల్లో, పెద్ద డ్రైనేజీ కాలువల్లో, ట్రాన్స్ఫార్మర్‌ల వద్ద స్వచ్ఛత పనులు చేపట్టాలని ఆదేశించారు. కూడళ్ళు, డివైడర్ల ప్రతిరోజూ తనిఖీ చేయాలన్నారు. ప్రతి దుకాణం వద్ద డస్ట్‌బిన్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *