NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మే 1న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

1 min read

నేటి నుండి మే 2 వరకు బ్రహ్మోత్సవాలు

అన్ని ఏర్పాట్లు పూర్తి -ఆలయ ఈవో లక్ష్మీనారాయణ..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరగనున్నాయి.చుట్టుపక్క గ్రామాల ప్రజలు మరియు బంధువులు అధిక సంఖ్యలో హాజరై లక్ష్మీ చెన్నకేశవ స్వామి సేవలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ప్రత్యేక సంప్రదాయం..

మే 2న శ్రీ లక్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

వచ్చేనెల మే రెండవ తేదీన సాయంత్రం 5:30 కు మిడుతూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి యు లక్ష్మీనారాయణ మంగళవారం సాయంత్రం అన్నారు.(బుధవారం 29వ తేదీ)నేటి నుండి మే 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం మహోత్సవం.. ఉదయం శేష వాహనం రాత్రి హనుమత్ ఉత్సవ కార్యక్రమం.30వ తేదీ సింహ వాహనం,రాత్రి 7:30 కు గరుడోత్సవం.మే 1వ తేదీ శుక్రవారం ఉదయం వ్రతంగా హోమం,పూర్ణాహుతి సాయంత్రం భక్తుల మధ్య  రథోత్సవ కార్యక్రమం జరుగును.రెండవ తేదీ ఉదయం తీర్ధావళి వసంతోత్సవం,సాయంత్రం ఐదు గంటలకు పారువేట.. ఈనెల 30 నుండి మే రెండు వరకు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ తెలిపారు.

రెండవ తేదీ రాత్రి డాన్స్ బేబీ డాన్స్

బ్రహ్మోత్సవాల సందర్భంగా  మే రెండవ తేదీ రాత్రి మాధవ్ ఈవెంట్స్ నెల్లూరు వారు నిర్వహించే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి.ఒకటవ తేదీ రాత్రి కబడ్డీ పోటీలు ప్రారంభించనున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *