శ్రీ మద్రామాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి
1 min read
శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ
కర్నూలు, న్యూస్ నేడు: మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి, ఉభయ వేదాంత పండితులు శాస్త్ర రత్నాకర, సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి వేడుకల సందర్భంగా కర్నూలు శివారులోని గోదాగోకులం నందు శ్రీమద్రామాయణ మహా యజ్ఞం అత్యంత వైభవంగా జరుగుతున్నదని శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ శ్రీ రఘునాథ ఆచార్యుల వారి విద్వత్తు అసామాన్యం. వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత నాలుగు రోజులుగా నిర్వహించబడుతున్న శ్రీ రామాయణ మహా యజ్ఞ పూర్ణాహుతి వారి తిరు నక్షత్ర పవిత్ర తిథి సందర్భంగా శుక్రవారం నిర్వహించబడుతోంది.ఇంతటి పరమ పవిత్రమైన కార్యక్రమంలో 2000 మందికి పైగా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం కూడా నిర్వహించబడుతోంది.లోకకల్యాణకారకమైన ఈ కార్యక్రమంలో నగర వాసులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని గోదా రంగనాథ స్వామి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో ప్రయాగ్రాజ్ నుండి రాఘవ ప్రపన్న జీయర్ స్వామీజీ, శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శఠగోపముని రామానూజ జీయర్ స్వామీజీ, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞ సమన్వయకర్త డాక్టర్ తొగట సురేశ్ బాబు, గోదాపరివారం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమాళ్ళ బాలసుధాకర్, వేముల జనార్ధన్, ఇటిక్యాల పుల్లయ్య, భీమిశెట్టి ప్రకాశ్, లింగం రవి, సురేష్, తలుపుల శ్రీనాథ్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం, చిత్రాల వీరయ్య, వేముల పవన్ కుమార్, డాక్టర్ నాగనారాయణ రావుపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం జరిగిన శ్రీమద్రామాయణం విశిష్టతపై హిందీ అద్యాపకులు యం. పార్వతి, తెలుగు ఉపాధ్యాయిని పసుపులేటి నీలిమ, అవధాని డాక్టర్ గంగుల నాగరాజు, యం గోపాలా చార్యులు, తదితరులు ప్రవచించారు.