శ్రీశైలం డ్యాం ఒకగేట్ ద్వారా నీటి విడుదల! కొనసాగుతోన్న వరద
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు: శ్రీశైలం డ్యాం ఒక రేడియల్ క్రస్ట్‌గేట్ ద్వారా వరదనీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ పరివాహకం నుంచి శ్రీశైలజలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో బుధవారం డ్యాం అధికారులు ఒక గేట్ నుంచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యహ్నం 12.30గంటల సమయానికి ఎగువ పరివాహకంలోని జూరాల నుంచి 1,03,845క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజి నుంచి 16,963క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,20,813క్యూసెక్కుల నీరు శ్రీశైలజలాశయంలోకి చేరుతోంది. ఈ క్రమంలో డ్యాం ఒకగేట్ను 10అడుగుల మేర ఎత్తి 27,983క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,472క్యూసెక్కులు, ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315క్యూసెక్కుల చొప్పున మొత్తం 94,770క్యూసెక్కుల నీటిని అటు నీటిపారుదల శాఖ, ఇటు ఇరురాష్ట్రాల జెన్కో శాఖలు దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నాయి. అయితే ఆ సమయానికి డ్యాం వద్ద నీటిమట్టం 884.80అడుగులు ఉండగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 214.3637టీఏంసీలుగా నమోదయింది.