ఓర్వకల్లు’లో స్టేట్ బ్యాంక్ ప్రారంభం
1 min read

ప్రారంభించిన సిజిఎం రాజేష్ కుమార్ పటేల్
న్యూస్ నేడు ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఇకనుండి స్టేట్ బ్యాంక్ సేవలు ప్రజలకు అందనున్నాయి.గురువారం ఉదయం ఓర్వకల్లులో నూతనంగా నిర్మించినస్టేట్ బ్యాంకు ను ప్రారంభించారు.ఈ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి సర్కిల్ నుండి చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) రాజేష్ కుమార్ పటేల్ నూతన స్టేట్ బ్యాంకు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.బ్రాంచ్ నుప్రత్యేకంగా పూల అలంకరణతో తీర్చిదిద్దారు. బ్యాంకులో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఓర్వకల్లుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రజలకు అందించనున్నామని ప్రజలు గమనించి బ్యాంకులో అకౌంట్ చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ ఎన్.నవీన్ నరసింహ చౌదరి అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవో కర్నూలు వి హేమ మరియు వివిధ బ్రాంచ్ మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

