ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
1 min read

జనసేన నాయకులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన సత్కారాలు
పోతునూరులో మొక్కలు నాటి,పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
ప్రతి జనసేన సైనికులు సేవా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు
ఏపీ వడ్డీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
డా:ఘంటసాల వెంకటలక్ష్మి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: జనసేన వ్యవస్థాపక అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం, విజయరాయి గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో విజయరాయి గ్రామంలో రక్త దాన శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు, మన పరిసరాలను నిత్యం శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకి దెందులూరు నియోజకవర్గం ఇంచార్జ్, ఏపీ వడ్డీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి పూల గుత్తెలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ డా: వెంకట లక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారని, మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని అన్నారు. పోతునూరు గ్రామంలో మొక్కలు నాటి, పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క జనసేన సైనికులు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజయరాయిజై జనసేన పార్టీ అధ్యక్షులు జల్లి రామ్ చరణ్ తేజ ఉపాధ్యక్షులు పందిరి రామారావు,విజయరాయి జనసేన నాయకులు, సుంకర ప్రసాద్ విభూది కొండ, మాసబత్తుల నరేష్, గుండం బాలు, సుంకర రామకృష్ణ, ఇంటూరి కృష్ణ, ఎన్.దానయ్య, సిహెచ్ మహేష్, ఆరే దుర్గాప్రసాద్, నాగరాజు, గిటుతూరి సాయి,పి పాపారావు, అన్నెపు,రాటలు, బమ్మిడి పెద్దరాజు, మీసాల పైడ్రాజు, పెద్దిరెడ్డి ప్రవీణ్, మీసాల ఈశ్వరరావు, కోట సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.


