NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ అడ్వాన్సు లో 199 ర్యాంకు సాధించిన పత్తికొండ విద్యార్థి  

1 min read

 పత్తికొండ , న్యూస్​  నేడు:  ప్రకటించిన జేఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో  పత్తికొండకు చెందిన కప్పట్రాళ్ల చెన్నకేశవులు ఏకంగా 199 వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన చెన్నకేశవులు జేఈఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 199 ర్యాంకు సాధించాడు. అలాగే కమ్యూనిటీ కేటగిరి కోటాలో 29 ర్యాంకు సాధించాడు. 2025లో ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా స్థాయిలో 206 ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడం తన లక్ష్యమని విద్యార్థి కప్పట్రాళ్ల చెన్నకేశవులు తెలిపాడు. విద్యార్థి ప్రతిభ పట్ల స్థానికుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులు కళ్యాణి కుమారి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని కాగా తండ్రి రమేష్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు.

About Author