NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు అండగా స్వామి వివేకానంద ట్రస్ట్

1 min read

51వ నెలకు చేరుకున్న నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం – ఆదోని భారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా యజ్ఞం

హోళగుంద న్యూస్ నేడు: సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు అండగా నిలుస్తూ స్వామి వివేకానంద ట్రస్ట్ మరియు ఆదోని భారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 51వ నెల నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 51 నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంటోంది.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హోటల్ ఈరన్న – ఎర్రమ్మలకు, వృద్ధురాలు రాధమ్మకు, అలాగే గ్రామ సేవలో నిమగ్నమైన గోర్క కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేశారు. బియ్యం, పప్పులు, నూనెతో పాటు ఇతర అవసరమైన గృహ వినియోగ సరుకులను పంపిణీ చేసి వారికి తోడ్పాటునందించారు.నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలోని అర్హులైన నిరుపేద వికలాంగులను గుర్తించి వారికి ప్రతినెల సేవా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో నెలనెలా మరింత మంది అవసరమైన వారికి నిత్యవసర సరుకులు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని చాటిచెబుతున్నాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. నిరుపేదల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమని, ట్రస్ట్ సభ్యుల సేవా స్పూర్తి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రవికాంత్, శ్రీధర్, మహేష్, మల్లికార్జున పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలను చేపట్టి మరిన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *