స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని మండల మహిళా సమాఖ్య భవనం నందు ఐసిడిఎస్ సూపర్ వైజర్ దేవకృపమ్మ ఆధ్వర్యంలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఅర్ఓ భారతి, డాక్టర్ రాహుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత, మరియు అనుబంధ పోషకాహారం పై అవగాహన కల్పించారు. బాలల ఆరోగ్యం, ఎదుగుదలలొ తల్లిపాల ప్రాముఖ్యత ఎంతో ఉంది, శిశువుకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, తల్లిపాల వలన శిశువుకు పూర్తి పోషణ, లభించడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లి శిశువు మధ్య అనుబంధం బలపడుతుంది ఆరు నెలలు వయసు వచ్చిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం ఇవ్వడం అవసరం అన్నం, పప్పు, కూరగాయలు, పండ్ల రసాలు, గుడ్డు వంటి పదార్థాలు శుభ్రంగా పోషక విలువలతో తయారుచేసి చిన్న పరిమాణంలో మొదలుపెట్టి క్రమంగా పెంచాలి, అలాగే అంగన్వాడీకేంద్రంలోఇచ్చే బాలామృతమునుకూడా తినిపిం చాలి అన్నారు. కావున ప్రతి తల్లి తమ పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం, ఆ తరువాత సరైన సమయానికి అనుబంధ పోషకాహారం అందించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు, కిషోర బాలికలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త • వహించాలన్నారు. ఇందులో భాగంగా అంగన్వాడి సిబ్బంది పౌష్టికాహారానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు అధికారులు ఏ పి ఏం క్రిష్ణమూర్తి, సి సి రాములమ్మ, సూపర్ వైజర్లు శకుంతల, శోభారాణి, పరమేశ్వరి అంగన్వాడి కార్యకర్తలు తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.


