NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ అంశాలపై తాసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించండి

1 min read

ప్రభుత్వ భూములకు సంబంధించి రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్ ​నేడు : రెవెన్యూ అంశాలపై తాసీల్ధార్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన రీతిలో సర్వీసులు ఇచ్చేందుకు సానుకూల దృక్పథంతో వ్యవరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో రెవెన్యూ, రీసర్వే అంశాలపై రెవెన్యూ సిబ్బందికి జిల్లా కలెక్టర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, డోన్ ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూములు, రీ సర్వే, 22ఏ, జాతీయ రహదారుల భూ సేకరణ తదితర రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన రీతిలో సర్వీసులు ఇచ్చేందుకు సానుకూల దృక్పథంతో వ్యవరించాలని తాసిల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై రెవెన్యూ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంతి రెండు రోజుల పాటు రోజుకు 11 గంటల చొప్పున అభివృద్ధిపై సమీక్ష చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి ? వాటిని మండల స్థాయిలో ఏవిధంగా అమలు అవుతున్నాయో అనే అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని… ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో మెరుగైన రీతిలో సర్వీసులు అందించాలన్నారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు గుర్తించడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు వున్నాయని… ఇందుకు తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి భూముల విస్తీర్ణం, సంబంధిత భూములు ఏ సర్వే నెంబరులో వుందో తెలుసుకోవడానికి ఇన్వెంటర్ రిజిస్టర్లు నిర్వహించాలని తాసిల్దార్లను ఆదేశించారు.గుజరాత్ రాష్ట్రంలో ఒక్క సెంటు ప్రభుత్వ భూమి ఉన్న కూడా వారు గుర్తించి ఆన్లైన్ లో నమోదు చేయడం వల్ల ఎక్కువ శాతం పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. రెవెన్యూ అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. జిల్లాలో విఆర్ఓ నుండి కలెక్టర్ స్థాయి వరకు భూ సమస్యలు ఏంటి ? వాటి పరిష్కారం సూచిస్తూ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. అయితే రెవెన్యూ మంత్రి విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 30వ తేదిలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కు 90 శాతం రెవెన్యూ అంశాల పరిష్కారం కోసం రావడం జరుగుతుందన్నారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు పరిష్కారం చేసే అంశాలు కూడా జిల్లా కేంద్రానికి రావడం ఏంటి అని ? ప్రశ్నించారు. కేవలం సుమోటో కేసులు మాత్రమే పరిష్కరించేలా చూడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జిఓ.ఎం. ఎస్.నెం.30 ప్రకారం 150 చదరపు అడుగుల వరకు ఆక్రమణలకు గురైన భూములు నియమ నిబంధనల మేరకు ఉచితంగా క్రమబద్ధీకరణ కొరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. ప్రైవేటు భూములను 22(ఎ) కింద మార్పులు చేస్తే సంబంధిత తాసిల్దార్ లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.  అదే విధంగా వెబ్ ల్యాండ్ లో ఒకరి పేరుకు బదులు ఇంకొకరి పేరు మీద అనుచితంగా మార్పులు, చేర్పులు చేస్తే కూడ సంభవిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. అనంతరం ల్యాండ్ అలినేషన్, ప్రైవేటు భూమిని 22(ఎ)లో చేర్చడం, ల్యాండ్ రెగ్యులరైజేషన్, అసైన్మెంట్ భూములు, ఆర్ఓఆర్-వెబ్ ల్యాండ్ తదితర రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సంపూర్ణ అవగాహన కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *