NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రగడవరం గ్రామాన్ని దత్తత తీసుకున్న తాళ్లూరి శ్రీనివాసరెడ్డి 

1 min read

గ్రామంలో పార్దేవ దేహాల మట్టి ఖర్చులకు 5000/- రూపాయలు ఆర్థిక సాయం

తాళ్లూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు అభినందనీయం

వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరి ఆకాoక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో పుట్టి అదే గ్రామంలో చదువుకొని తను ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయనె తాళ్లూరి శ్రీనివాస్ రెడ్డి ఆయన స్నేహితుడి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఆయన గుండెల్ని పిండేసిది తన బాల్యంలో అయన స్నేహితుడీ కుటుంబంలో జరిగినటువంటి సంఘటన తన స్నేహితుడి తల్లి అకాల మరణం చెందితే ఆ స్నేహితుడు పేదరికం అనుభవిస్తూ మట్టిఖర్చులకి కూడా ఎంతో ఇబందులలొ ఉన్నటువంటి స్నేహితుడిని అయన ప్రత్యక్షంగా చూసారు. స్నేహితుడి ఇబ్బందులను గమనించి అయన  ఒక నిర్ణయం తీసుకున్నారట తాను సంపాదించిన సంపాదనలో పేదరికం అనుభవిస్తున్న వారికీ మట్టి ఖర్చులు కూడా పెట్టుకోలేని స్థితిలొ ఉన్న తనసొంత గ్రామం ప్రగడవరం మరియు చుట్టుపక్కల ప్రగడవరం పంచాయితీలో గ్రామాలన్నిటికి సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. నాటి నుండి నేటి వరకు  మాకు సాయం కావాలి అని ఆయనకి ఒక వీడియో క్లిప్ పంపితే మట్టి ఖర్చుల నిమిత్తం రూ:5000/-లు  సాయం చేస్తునట్టు వివరించారు.చేసేది చిన్న సహాయం అయినా పదిమందికి ఆదర్శంగా నిలుస్తూన్న ఈ కార్యక్రమం పేరు “నా గ్రామం నా సాయం”గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది.ఈ కార్యక్రమం జనవరి ఒకటి 2024 నుండి  మొదలు పెట్టి కుల మతలకు అతీతంగా,పార్టీల బేధాలు లేకుండా సాయం కోరిన ప్రతి ఒకరికి కూడా అయన ఆ సాయం అందిస్తున్నారు. అయన ఇప్పటికి 56 మందికి మట్టి ఖర్చులకి రూ:5000/-లు చొప్పున సాయం అందించినట్లు వివరించారు. ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు మరువలేనిదని,తాళ్లూరి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో  అయన చేయాలని ప్రగడవరం గ్రామప్రజలు తెలియజేస్తున్నారు. అయన చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలను పొందాలని,కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని గ్రామస్తులు ఆకాoక్షితున్నారు.

About Author