PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ

1 min read

రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగు ఖాయం:కాత రమేష్ రెడ్డి 

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కనుమరుగు కాయమని మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా మిడుతూరు సబ్ స్టేషన్ దగ్గర టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట టిడిపి నాయకులు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఈసందర్భంగా కాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఎన్నికల ముందు చెప్పింది ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటిలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.133 కేవీ,32 కేవీ, విద్యుత్ చార్జీలు అప్పు బాదుడే మొత్తం 57,188 కోట్లు మరియు  టారిఫ్ ల కుదిరింపు స్లాబుల మార్పు పిక్స్ డ్ చార్జీలు అదనపు డిపాజిట్ల రూపంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండల విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ కు వినతి పత్రం అందజేశారు.ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల టిడిపి నాయకులు సుధాకర్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి,శేషిరెడ్డి, రమణారెడ్డి,సుధాకర్,ఇద్రీస్,సుభాన్,మహేశ్వర్ రెడ్డి, మక్బూల్ బాష,చాకర్ వలి, సోఫీ సాహెబ్,సర్వోత్తమ్ రెడ్డి, రఫీ,రమణారెడ్డి,రహంతుల్లా, అబ్దుల్లా,వెంకటేశ్వర్లు,శివ,సుల్తాన్,చాంద్ బాష, వెంకటయ్య,ఖాజమియా,లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author