ద్రౌపది ముర్ము పై తేజస్వీ సంచలన వ్యాఖ్యలు !
1 min read

పల్లెవెలుగువెబ్ : అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తేజస్వీ యాదవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవనంలో విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్డీయే మద్దతున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కనీసం అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ఆమె మాట్లాడలేదు. అందుకే రాష్ట్రపతి భవన్లో ‘విగ్రహం’ అవసరం లేదంటూ ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు.

