వాయు కాలుష్యం తగ్గించడంలో ఏలూరుకు జాతీయస్థాయి లో అరుదైన గుర్తింపు
1 min read
కేటగిరి-3 కింద దేశంలోనే నాలుగో స్థానం కైవసం
ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ అన్నాప్రగడ భాను ప్రతాప్
నగర ప్రజలంతా స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు మొక్కలు పెంచాలని పిలుపు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ తీసుకున్న చర్యలకు గాను జాతీయస్థాయిలోఅరుదైన గుర్తింపు లభించింది.ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ -2026 సర్వేలో వాయు కాలుష్యాన్ని 61శాతం క్యూబిక్ మీటర్లకు నియంత్రించడంలో
ఏలూరు నగరం కేటగిరి-3 (3
లక్షల లోపు జనాభా) విభాగంలో దేశంలోనే నాలుగో స్థానం కైవసం చేసుకుంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలోనే ఎంపిక అయిన రెండు కార్పొరేషన్లలో ఏలూరు ఒకటిగా నిలవడం గమనార్హం. నగరాల్లో ఉన్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం
ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తుంది.ఆ నిధులను సక్రమంగా వినియోగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఆయా కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నరు.
ఈ నేపథ్యంలోనే ఏలూరు నగరానికి గత ఐదు ఏళ్లుగా కేంద్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది.
ఈ నిధులతోనే నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన
వాటర్ ఫౌంటెన్లు, అండ్ టు అండ్ రోడ్లు నిర్మాణం, మొక్కల
పెంపకం, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాలు నిర్వహణ, పార్కులు అభివృద్ధి, ఎల్పిజి గ్యాస్ వినియోగం ప్రోత్సాహంతదితర వాటికి ఖర్చు చేశారు. ఈ విధంగా చేపట్టిన పనులుసత్ఫలితాలను ఇవ్వడంతో నగరంలో ఈ ఏడాది వాయు కాలుష్యం 61క్యూబిక్ మీటర్లకు తగ్గింది. గతంలో ఈ వాయు కాలుష్యనియంత్రణలో ఏలూరు నగరం 31వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు చేపట్టిన పనులతో నగరంలో వాయుకాలుష్యం తగ్గడంతో దేశంలోనే అత్యధికంగా వాయు కాలుష్యాన్ని తగ్గించిన కార్పొరేషన్లలో ఏలూరుకు టాప్ 10 జాబితాలో స్థానందక్కిందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోకమిషనర్ అన్నాప్రగడ భాను ప్రతాప్ మాట్లాడారు. ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రించడంలో కార్పొరేషన్ అధికారులు చేపట్టిన చర్యలకు ప్రజల సహకారం అందించిన కారణంగానే ఇటువంటి అద్భుత ఫలితాలు సాధ్యమైందన్నారు. నగరంలో వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛమైనవాతావరణం నెలకొల్పేందుకు ప్రజలంతా ఐకమత్యంతో మొక్కలు పెంచాలని కమిషనర్పిలుపునిచ్చారు.


