చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత
1 min read
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: చంద్రగ్రహణం సందర్భంగా నేడు ఉభయ దేవాలయాలు 6:30 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయద్వారాలు మూసివేయబడుతాయి. ఆలయ శుద్ధి అనంతరం 8వ తేది వేకువజామున 3.00గంటలకు ఆలయద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, తరువాత 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు జరుగుతాయి. తరువాత 4.30గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగ ళహారతులు జరిపించబడుతాయి. అనంతరం భక్తులను అనుమతిస్తారు.